Ram: రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ హై ఓల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ రూపొందుతుంది. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబరు 20న థియే టర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ, ఈ సినిమాలోని రామ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం (మార్చి 27)న అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మరి..దసరాకు థియేటర్స్‌లో రామ్ ఎనర్జీ ఏ స్థాయిలో వర్కౌట్ అవుతుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.