Prabhas Salaar Update: ‘సలార్’ సినిమా షూటింగ్ తిరిగి స్టారై్టంది. ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న పాన్‌ఇండియన్ ఫిల్మ్ ‘సలార్’. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్, శ్రుతీహాసన్‌లపై కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే సీన్స్ ఇవి. ‘సలా ర్’ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.


Ntr With ThalapathyVijay66: దళపతి విజయ్ సినిమాలో గెస్ట్‌గా ఎన్టీఆర్?
Ram20 with Boyapati: రామ్ – బోయపాటి లాంచ్ ఆ రోజే!
ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ పూర్తయింది. మళ్లీ జూన్ ఎండ్‌లో ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటివరకు ప్రభాస్ ‘సలార్’ సెట్స్‌లోనే ఉంటారు. అయితే జూన్‌లో ఎండింగ్‌లో స్టార్ట్ అయ్యే ‘ప్రాజెక్ట్ కె’ సినిమా చిత్రీకరణలో ప్రభాస్‌తోపాటు అమితాబ్‌బచ్చన్, ఈ చిత్రం హీరోయిన్ దీపికా పదుకొనె కూడా పాల్గొంటారు. ఈ ప్రాజెక్ట్ కె చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. 2024లో ఈ సినిమా
రిలీజ్ కానుంది. మరోవైపు ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న థియే టర్స్‌లో రిలీజ్ కానుంది. అలాగే ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ అనే చిత్రం కమిటైన సంగతి తెలిసిందే. ఈ లోపు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ‘రాజా డీలక్స్’ అనే హారర్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నారు.