Ram20 with Boyapati: రామ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శీను తెరకెక్కించనున్న సినిమా ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఈ సినిమా జూలై 1న ప్రారంభం కానుంది. ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌ను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోవ్సవం నాడే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటించ నున్నారు? అనే విషయంపై ఓ క్లారిటీ రానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా మేజర్ షూటింగ్ తెలుగు రాష్ట్రాల లొకేష న్స్‌లోనే జరుగుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించనున్నారు. ‘సరైనోడు’, ‘అఖండ’ చిత్రాల తర్వాత తమన్, దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్‌లో వస్తున్న థర్డ్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం. ఇక ప్రస్తుతం రామ్ ‘ది వారియర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. లింగుసామీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జూలై 14న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
Ntr With ThalapathyVijay66: దళపతి విజయ్ సినిమాలో గెస్ట్‌గా ఎన్టీఆర్?