Nikhil Siddhartha: హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. నిఖిల్ 2020 మేలో పల్లవితో ఏడడుగులు వేశాడు. ఈ దంపతులు తాజాగా తల్లిదండ్రులైయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో పల్లవి ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ హ్యాపీమూమెంట్స్లో భావోద్వేగానికి లోనైయ్యాడు నిఖిల్(Nikhil Siddhartha). ‘‘జీవితం ఓ చట్రంలా అనిపిస్తోంది. 2022లో మా నాన్న గారు చనిపోయారు. చాలా బాధపడ్డాం. ఈ ఏడాది మా కుటుంబంలోకి ఓ కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చిచేరాడు. మాకు బాబు పుట్టాడు. మా నాన్నగారే నా చెంతకు తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ టియర్స్’ అంటూ నిఖిల్ చెప్పుకొచ్చారు.
మరోవైపు ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభూ’, ‘ది ఇండియన్ హౌస్’ సినిమాలు చేస్తున్నాడు. అలాగే తనకు కలిసొచ్చిన ‘కార్తికేయ’ ఫ్రాంచైజీ ‘కార్తికేయ 3’ని కూడా వచ్చే ఏడాది సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలనుకుంటున్నాడు నిఖిల్. ‘స్వయంభూ’ చిత్రం ఈ ఏడాదేవిడుదల కానుంది.