నటసింహా నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేనిల ఫస్ట్ క్రేజీ కాంబినేషన్‌లో పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఓ భారీ చిత్రం(NBK107) రూపొందుతోంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్(NBK107)లో బాలయ్యను ఇంత వరకు చూడని సరికొత్త రూపంలో చూపించనున్నాడు దర్శకుడు గోపిచంద్ మలినేని. ఈ మూవీ ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది.
తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ లుక్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుతో పాటు రగ్డ్ లుక్‌లో మెడపై రుద్రాక్ష మాలతో బాలకృష్ణ స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్నారు, ఈ పోస్టర్‌లో నల్ల చొక్కా మరియు గోధుమ రంగు పంచె ధరించాడు. క్యారెక్టర్‌కు మరింత ఎలివేషన్ ఇచ్చే వాచ్, ఉంగరాలు, షేడ్స్ వంటి వాటిని కూడా పోస్టర్లో మనం చూడొచ్చు. మొత్తంమీద బాలకృష్ణ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
పక్కా మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం సిరిసిల్లలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ పోస్టర్ ఫైట్ సీక్వెన్స్ ను రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ రూపొందిస్తున్నారు.
బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర ద్వారా కన్నడ నటుడు దునియా విజయ్ తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ ని ఎంపిక చేసుకున్నారు.
నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని, మైత్రి మూవీ మేకర్స్ #NBK107 షూటింగ్ ప్రారంభం
నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.