అఖండ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నటిసింహా నందమూరి బాలకృష్ణ, క్రాక్ వంటి సక్సెస్ఫుల్ తర్వాత దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్లో బాలయ్య107వ సినిమాగా పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేడు సిరిసిల్ల టౌన్ (తెలంగాణ)లో ప్రారంభమైంది. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌తో షూటింగ్‌ని మొదలుపెట్టారు మేకర్స్. బాలకృష్ణ – ఫైటర్స్‌పై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు.
మాస్ హీరో మరియు మాస్ దర్శకుడు ఇద్దరూ కలిసి మాస్ ఆడియన్స్ కి ఈ సినిమాతో మంచి ట్రీట్ ఇవ్వనున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.
బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర ద్వారా కన్నడ నటుడు దునియా విజయ్ తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీ ని ఎంపిక చేసుకున్నారు.
నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి రిషీ పంజాబీ సినిమాటోగ్రఫర్, నవీన్ నూలీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.