తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించిన కీలక పరిణామాలు గురువారం చోటుచేసుకున్నాయి. ఏపీలోని
టికెట్ ధరల విషయమై ముఖ్యమంత్రి జగన్‌గారిని చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి, ఆలీ, పోసానీ కృష్ణమురళి వంటి ప్రముఖులు కలుసుకున్నారు. అనంతరం ఈ సమావేశంలో సానుకూలమైన చర్చలు జరిగాయని, పరిశ్రమకు మేలు జరుగుతుందనే నమ్మకం ఉందని సమావేశం అనంతరం ప్రభాస్, రాజమౌళి, చిరంజీవి, మహేశ్‌బాబు చెప్పుకొచ్చారు.


తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నింటీని, అన్నీ కోణాల్లో అర్థం చేసుకుని, పూర్తి అవగాహనతో ఎంతో సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి, సమస్యలపై ఆమోద్యయోగ్యమైన నిర్ణ
యాలను తీసుకోవడమే కాకుండ, తెలుగు చిత్ర పరిశ్రమ భవిష్యత్‌కు కార్యాచరణను సూచిస్తూ, పరిశ్రమ
కి అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసా ఇస్తూ ఎంతో సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌గారికి పరిశ్రమలోని ప్రతి ఒక్కరి తరఫున మరో మారు కృతజ్ఞతలు. త్వరలోనేఅధికారికంగా పరిశ్రమకు శుభవార్త అందుతుందని ఆశిస్తున్నాను.
మీరు ఇచ్చిన భరోసాతో, మీరు చేసిన దిశానిర్ధేశంతో తెలుగు పరిశ్రమకు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు
వెళ్తుందన్న నమ్మకంతో హృదయపూర్వక ఆనందాన్ని తెలియజేస్తూ…శ్రీ జగన్‌గారికి ధన్యవాదాలు తెలియ జేస్తున్నాం అని చిరంజీవి పేర్కొన్నారు. అలాగే నాగార్జున, మహేశ్‌బాబు కూడా జగన్‌గారికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు.
అయితే ఏపీ సీఎం జగన్‌తో జరిగిన సమావేశానికి ప్రస్తుత మావీ ఆర్టిస్ట్్స అసోషియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు, మరో సీనియర్ నటులు, నిర్మాత మోహన్‌బాబు పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఈ అత్యంత కీలకమైన సమావేశానికి ఎన్టీఆర్ కూడా హాజరవుతారనే వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ ఆ సమావేశంలో భాగస్వామ్యం కాలేదు. మరోవైపు అక్కినేని అమలకు కరోనా సోకడంతో ఈ సమావేశానికి నాగార్జున దూరం కావాల్సి వచ్చిందని తెలిసింది. అయితే ట్వీటర్ వేదిక నాగార్జున జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Vijaydevarakonda Liger Shoot Completed. And Janaganamana Starts. Full Detailes Inside