అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం వలిమై. ఈ చిత్రం నిర్మాత బోనీకపూర్ వలిమై చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. తాజాగా వలిమై సినిమా తెలుగు ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు. కన్నడట్రైలర్ను సుదీప్ లాంచ్ చేశారు. వలిమై చిత్రం ఈ నెల 24న థియేటర్స్‌లో విడుదల కానుంది. అలాగే ఈ చిత్రంలో కార్తికేయ, హ్యూమా ఖురేషీ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో కార్తికేయ నెగటివ్ పాత్రలో నటించారు.
ట్రైలర్లో కార్తికేయ యాక్టింగ్ ఆకట్టుకునేలా ఉంది. ఇక అజిత్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యే కంగా చెప్పాల్సిన విషయం ఏదీ లేదు. ఎప్పటిలాగానే అద్భుతంగా నటించారు. మరోవైపు నొర్కండ పరవై, వలిమై చిత్రాల తర్వాత హీరో అజిత్, దర్శకుడు హెచ్. వినోద్, నిర్మాత బోనీకపూర్ కాంబినేషన్లో మరో కొత్త సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ హైదరాబాద్‌లో స్టార్ట్ అయ్యింది.