ప్రముఖ దర్శకులు మణిరత్నం స్వర్ణయుగాన్ని కళ్ల ముందుకు తీసుకువస్తానంటున్నారు. ఆయన డైరెక్షన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్, మద్రాస్ టాకీస్ అధినేత మణిరత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు పార్టులుగా ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిపార్టును వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. వేసవిలో వచ్చే అవకా శాలు ఉన్నట్లు కోలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగానే ఈ చిత్రం రూపొందుతుంది. అయితే తెలుగులో వచ్చిన ‘బాహుబలి’ చిత్రాన్ని ‘పొన్నియిన్ సెల్వన్’ మించి పోతుందని కోలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు. కానీ ‘బాహుబలి’ మార్క్‌ను అందుకోవాలంటే అంత ఈజీ కాదు. ఫస్ట్‌పార్టు సక్సెస్ అవ్వాలి. అప్పుడే సెకండ్ పార్టుపై ఆసక్తి ఉంటుంది. అలాగే ఫస్ట్‌పార్టు ఎండింగ్‌ను క్యూరియాసిటీతో ఎండ్ అవ్వాలి. మరి.. ఇవన్నీ ‘పొన్నియిన్ సెల్వన్’లో ఉంటాయనే ఆశిస్తున్నారు కోలీవుడ్ ఫ్యాన్స్. మరి..ఫ్యాన్స్ అంచనాలను ‘పొన్నియిన్ సెల్వన్’ అందు కుంటుదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
పొన్నియిన్ సెల్వన్ చిత్రం బాహుబలిని మించిపోతుందా?
Leave a comment
Leave a comment