‘సర్కారువారిపాట’ నుంచి ‘కళావతి’ పాట వచ్చేసింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘కళావతి’ పాటను ఫిబ్రవరి 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆల్రెడీ అన్‌లైన్‌లో ‘కళావతి’ లిరికల్ వీడియో చెక్కర్లు కొడుతుండటంతో ‘సర్కారువారిపాట’ చిత్రంయూనిట్ ఒకరోజు ముందుగానే ‘కళావతి’ పాటను విడుదల చేయకతప్పలేదు. దీంతో తమన్ చాలా మనస్తాపానికి గురైయ్యారు. తన ఆవేదనను ట్విటర్‌లో షేర్ చేశారు.
ఇక ‘కళావతి’ విషయానికి వస్తే…తమన్ సంగీత సారథ్యంలో ఆనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ‘‘నా ఫెవరెట్స్ సాంగ్స్‌లో ‘కళావతి’ తప్పక ఉంటుందని మహేశ్‌బాబు, దాదాపు ఆరుసంవత్సరాల తర్వాత మహేశ్‌బాబుగారితో వర్క్ చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. గత 24 గంటలుగానా కళ్లు కన్నీటితో వర్షిస్తూనే ఉన్నాయని తమన్ ట్వీట్స్ చేశారు.
ఇక మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారువారిపాట’ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, కీర్తీ
సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘వెన్నెల’ కిశోర్, సుబ్బరాజు కీలక పాత్రధారులు. రామ్ ఆచంట, గోపీ ఆచంట,నవీన్‌ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12న రిలీజ్ కానుంది. మరోవైపు ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూట్లో మహేశ్‌బాబు పాల్గొంటున్నారు.బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్న చిత్రం ఇది. ఇందులో బ్యాంకు ఉద్యోగిణి కళావతి పాత్రలో కనిపిస్తారు కీర్తీసురేశ్. మలయాళ నటి సౌమ్యా మీనన్ ‘సర్కారువారిపాట’ చిత్రంలో ఓ కీ రోల్ చేశారు.