కెమెరా మందు అనుపమలా వంట చేశాను కానీ రియల్‌లైఫ్‌లో వంట విషయంలో తనకు సున్నా మార్కలని ప్రియమణి అంటున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘భామాకలాపం’ ఈ నెల 11 నుంచి ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘భామకలాపం’లో అనుపమ అనే యూట్యూబర్ చెఫ్ పాత్రలో నటించారు ప్రియమణి. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. నిజజీవితంలో డేరింగ్ అండ్ డైనమిక్‌గా ఉండే తనకు అనుపమలాంటి పాత్ర పోషించడం చాలా కష్టంగా అనిపించదన్నారు. తానుఅనుపమ అంతా అమాయకురాలిని కానని, అనుపమలా ఎవరూ ఉండకూడదని ప్రియమణి అన్నారు. అలాగే ఇతరుల విషయాల్లో అనవసరం జోక్యం చేసుకోవడం తనకు ఏ మాత్రం ఇష్టం ఉండదని, అలా చేస్తే కష్టాలను కొనితెచ్చుకున్నట్లే అవుతుందని హితవు పలికారు ప్రియమణి. ప్రస్తుత రోజుల్లో హీరోయిన్స్‌కు
మంచి పాత్రలు వస్తున్నాయని, ఇది మంచి పరిణామని ఆమె అన్నారు. తాను కెరీర్లో చేయాల్సిన పాత్రలు ఇంకా ఎన్నో ఉన్నాయని, విలన్ రోల్స్ చేయడానికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నానని అన్నారామె. ప్రజెంట్ తమిళం చిత్రం ‘కొటేషన్గ్యాంగ్’ గ్యాంగ్‌తో బిజీగా ఉన్నానని, ఆల్రెడీ యాక్ట్ చేసిన కన్నడ డాక్టరు 56, తెలుగు విరాటపర్వం చిత్రాలు విడుదల కావాల్సి ఉందని ప్రియమణి చెప్పుకొచ్చారు. అలాగే ఫ్యామిలీమ్యాన్ థర్డ్ సీజన్ షూటింగ్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్లుగా కూడా ప్రియమణి అన్నారు.
నేను అనుపమ అంత అమాయకురాలిని కాను: ప్రియమణి
Leave a comment
Leave a comment