నాని (Nani) హీరోగా కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ శ్రుతీహాసన్(Shruti Haasan) ఓ కీలక పాత్ర చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. కాగా శనివారం నుంచి ఆమె ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. కాగా ఈ చిత్రంలో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తున్నారు. చెరుకూరి మోహన్, విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 21న విడుదల కానుంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
TAGGED:
Mrunal thakur, nani, nani30, Shruti Haasan
TollywoodHub