విజయ్ ఆంటోని (Vijay Antony) హీరోగా 2016లో వచ్చిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ సూపర్‌డూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాను ‘బిచ్చగాడు’గా తెలుగులో విడుదల చేస్తే టాలీవుడ్ లోనూ హిట్‌గా నిలిచింది. 2014లో వచ్చిన విజయ్ ఆంటోని సలీమ్ తర్వాత విజయ్‌ఆంటోనికి దక్కిన మరో హిట్ ఫిల్మ్ ‘బిచ్చగాడు’ ఈ సినిమా తర్వాత విజయ్ ఆంటోనితెలుగులో పలు సినిమాలను విడుదల చేసినప్పటికీని ‘బిచ్చగాడు’ స్థాయి హిట్ దక్క లేదు. దీంతో ‘బిచ్చగాడు’ 2 సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాడు విజయ్ ఆంటోని.
మారిన దర్శకుడు
బిచ్చగాడు (2016) సినిమాకు శశి దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా సీక్వెల్ ‘బిచ్చగాడు 2’కు జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు ప్రియా కృష్ణస్వామి దర్శకత్వ
బాధ్యతలను స్వీకరించారు. కానీ ప్రియా కృష్ణస్వామి తప్పుకోవడంతో తమిళ దర్శకుడు ‘మెట్రో’ ఫేమ్ ఆనంద్‌కృష్ణన్‌ను ‘బిచ్చగాడు 2’కు తీసుకున్నారు విజయ్ ఆంటోని. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆనంద్‌కృష్ణన్ కూడా తప్పుకున్నారు.ఫైనల్‌గా విజయ్ ఆంటోనియే ‘బిచ్చగాడు 2’కు దర్శకత్వం వహించారు.
తీవ్రంగా గాయపడ్డ విజయ్‌ఆంటోని…రిలీజ్ డేట్ మార్పు
‘బిచ్చగాడు’ సీక్వెల్ ‘బిచ్చగాడు 2’ షూటింగ్ మలేషియాలో జరుగుతున్నప్పుడు విజయ్‌ఆంటోనీ తీవ్రంగా గాయపడ్డారు. ఐసీయూలో కూడా చికిత్స తీసుకు న్నారు. ఫైనల్‌గా కోలుకుని షూటింగ్‌ను పూర్తి చేసి, సినిమాను ఏప్రిల్ 14న ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు విజయ్ ఆంటోని. కానీ ఈ సినిమాను మే 19న విడుదల చేస్తున్నట్లు లేటెస్ట్‌గా ప్రకటించారు విజయ్‌ఆంటోని. అలాగే తెలుగు, తమిళం భాషల్లోట్రైలర్స్‌ను కూడా విడుదల చేశారు.
కథ
‘బిచ్చగాడు’ సినిమా మదర్‌సెంటిమెంట్ నేపథ్యంలో సాగగా, ‘బిచ్చగాడు 2’ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం బికిలీ అనేకొత్త పదాన్ని కూడా సృష్టించారు విజయ్‌ఆంటోని. ఇండియాలోనే అత్యంత సంపన్నుడైన విజయ్ గురుమూర్తి ఓ ప్రమాదానికి గురి అవుతాడు. కానీ అది చేసింది సత్య అని అతన్ని అరెస్ట్ చేస్తారు. కోర్టుకేసులో అప్పుడు ఏం జరిగింది? అన్నదే కథ. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ సరసనకావ్యథాపర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్‌ఆంటోని భార్య ఫాతిమా ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. బిచ్చగాడు 2 సినిమాకు విజయ్ ఆంటోనీయే సంగీత దర్శకుడు, ఎడిటర్ కూడా కావడం విశేషం.