ఫుల్ ఫన్ ఎలిమెంట్స్‌తో అదిరిపోయేలా ఉంది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ( Miss Shetty Mr Polishetty) టీజర్. అనుష్కాశెట్టి(Anushka Shetty) ,నవీన్ పొలిశెట్టి (naveenpolishetty) ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్పైవంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అనుష్క, నవీన్‌లతో పాటు జయసుధ, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రంలో చెఫ్ అన్విత పాత్రలో అనుష్కాశెట్టి, స్టాండప్ కమేడియన్‌గా నవీన్పొలిశెట్టి కనిపిస్తారు. పెళ్లి పట్ల అన్వితకు మంచి అభిప్రాయం లేదు. అన్విత అభిప్రాయాన్ని ఆమె కుటుంబసభ్యులు కూడా సపోర్ట్చేస్తుంటారు. ఇటు నవీన్పొలిశెట్టి స్టాండప్ కమేడియన్‌గా చేయడం అతని కుటుంబసభ్యలుకు నచ్చదు. కాగా అనుష్కాశెట్టి చెఫ్‌గా వర్క్ చేస్తున్న హోటల్లోనే స్టాండప్ కమేడియన్‌గా వర్క్ చేయడానికి వస్తాడునవీన్. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య స్నేహాం చిగురిస్తుంది. ఈ స్నేహాం వారి జీవితాలను ఏ విధంగాప్రభావితం చేసింది? అన్నదే ‘మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా కథనంగా తెలుస్తుంది.
Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ పూర్తి రివ్యూ (రెండు పార్టలు కలిపి)