ప్రముఖ దర్శకులు, నిర్మాత, రచయిత దాసరి నారాయణరావు జీవితం వెండితెరపైకి రానుంది. దాసరి బయోపిక్కు ‘దర్శకరత్న’ టైటిల్‌ను ఖరారు చేశారు. దాసరి శిష్యులు ధవళ సత్యం ‘దర్శకరత్న’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తాడివాక రమేష్ నాయుడు ‘దర్శకరత్న’ బయోపిక్‌ను నిర్మించనున్నారు. ఇప్పటికే ‘దర్శకరత్న’ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇక వెండితెరపై దాసరి నారాయణరావుగా ఎవరు కనిపిస్తారనే విషయంపై త్వరలో క్లారిటీ ఇస్తామని అంటున్నారు తాడివాక రమేష్.

