venkatesh విక్టరి వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శ కత్వంలో రూపొందుతోన్న చిత్రం నారప్ప
. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నారప్ప భార్య సుందరమ్మ
గా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. మెలొడి బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ చలాకీ చిన్నమ్మీ..ఈ రోజు విడుదలైంది.
వెంకటేష్ ఫ్యామిలీ అంతా కలిసి తన కొడుకు పెళ్లి చూపులకు వెళ్లే నేపథ్యంలో వచ్చే పాట ఇది. కార్తీక్ రత్నం ఈ చిత్రంలో వెంకటేష్ కొడుకుగా నటించిన విషయం తెలిసిందే..ఈ ఫ్యామిలీ పాటకు చిన్న రొమాంటిక్ టచ్‌ని కూడా కలిపి మెలొడి బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు. ఆదిత్య అయ్యంగార్, నూతన మోహన్ శ్రావ్యంగా ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ మంచి సాహిత్యాన్ని అందిం చారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగిశాయి. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనున్నారు మేకర్స్. తమిళ హిట్ అసురన్ తెలుగు రీమేక్ గా నారప్ప రూపొందింది
విక్టరి వెంకటేష్ నారప్ప చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ చలాకీ చిన్నమ్మీ.. విడుదల
Leave a comment
Leave a comment