సింహ, లెజెండ్ చిత్రాల హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన
చిత్రం అఖండ
. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న విడుదలైంది. రీసెంట్ టైమ్స్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం జనవరి 20తో 103 కేంద్రాలలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి 200 కోట్లు రాబట్టిందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఓవర్‌సీస్‌లోనూ అఖండ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాత రవీందర్ చెబుతున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించన ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా, జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటించారు. ఇక అఖండ సక్సెస్‌లో ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ది కీలక పాత్ర. ముఖ్యంగా తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బాగా ప్లస్ అయ్యిందనే చెప్పుకోవచ్చు.



