సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలకు తమ తర్వాతి సినిమాలను గురించి ఓ క్లారిటీ ఉంది. అయితే మరో సీనియర్ హీరో వెంకటేశ్ మాత్రం తన తర్వాతి ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకోవడంలో కాస్త ఇబ్బందు లు పడుతున్నారు. ప్రస్తుతం ఎఫ్ 3
, చిత్రం రానా నాయుడు* వెబ్‌సిరీస్ కాకుండా వెంకటేశ్ చేతిలో మరోసినిమా లేదు. అలాగే వెంకీ చేసిన
నారప్ప,
దృశ్యం 2చిత్రాలు రీమేక్స్ కావడం, ఇవి థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల కావడం వంటి అంశాలు వెంకీ అభిమానులకు పెద్దగా రుచించలేదు. పైగా ఇప్పటి ఎఫ్ 3 కూడా ఆల్రెడీ వెంకీ చేసిన
ఎఫ్ 2` సినిమాకు సీక్వెల్ అంటున్నారు. అయితే కొన్ని రీమేక్ ఆఫర్స్ వచ్చినప్పటికీని వెంకీ తన తర్వాతి సినిమా స్క్రిప్ట్ కొత్తదిగా ఉండాలని భావిస్తున్నారట. దీంతో ఈ బాధ్యతను నిన్నుకోరి, మజిలీ వంటి హిట్ సినిమాలను తీసిన శివ నిర్వాణకు అప్ప జెప్పారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పైనే శివ నిర్వాణ కసరత్తులు చేస్తున్నట్లు ఫిల్మ్గనర్ సమాచారం. ఒకవేళ ఈ సినిమా సెట్ అయితే వెంకీ కెరీర్లో 75వ చిత్రం అవుతుంది.
ఇటు నిన్నుకోరి, మజిలీ సినిమాల సక్సెస్‌లు శివ నిర్వాణకు ఎంత మంచి పేరు తెచ్చిపెట్టాయో, ఆయన దర్శకత్వంలో వచ్చిన టక్‌జగదీష్ చిత్రం అంతే ఫెయిల్ అయ్యింది. దీంతో శివ నిర్వాణ కూడా హిట్ కొట్టా లనే ఒత్తిడిలో ఉన్నారు. నిజానికి శివ నిర్వాణ తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉండాలి. కానీ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని లైగర్
తో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నారు. ఇక సుకుమార్ దర్శకత్వంలోని విజయ్ దేవరకొండ సినిమా 2023లో స్టార్ట్ కానుంది. దీంతో విజయ్-శివ నిర్వాణల ప్రాజెక్ట్ వెళ్లి …వెంకీ- శివ నిర్మాణల ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ఇలా పరోక్షంగా వెంకీ నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ కావడానికి విజయ్ దేవరకొండ ఓ కారణం అయ్యారు.
అక్షయ్‌కుమార్ బచ్చన్ పాండే రిలీజ్ ఖరారు..టెన్షన్లో ప్రభాస్ ఫ్యాన్స్