Trisha Krishnan- AVRaju: హీరోయిన్ త్రిషకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు ఏవీ రవి(Trisha Krishnan- AVRaju). అసలు…ఏం జరిగి దంటే…. తమిళ నాడుకు చెందిన ఏడీఎమ్కే మాజీ రాజకీయ నేత ఏవీ రాజు ఓ స్థానిక ఎమ్ఎల్ఏని దుయ్యబడుతూ ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ త్రిషను ఉద్దేశించి ఏవీ రవి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని, వారు చెప్పినట్లుగా హీరోయిన్ త్రిష చేస్తారని, ఇందుకు ఆమెకు ఓ పాతిక లక్షలు ఇస్తే చాలని ఆరోపణలు చేశారు ఏవీ రాజు. గంటల్లో ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఏవీ రాజు అంత పెద్ద ఆరోపణలు చేస్తే…త్రిష ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారన్న చర్చ కూడా మొదలైంది ఇంటర్నెట్లో. మరోవైపు నటుడు మన్సూర్ అలీఖాన్ కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు వెంటనే స్పందించిన త్రిష ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారనే కామెంట్స్‌లో సోషల్‌మీడియా మాద్యమాల్లో వచ్చాయి. వ్యవహారం అదుపు తప్పిపోతుండటంతో ఈ పరిస్థితులపై త్రిష స్పందించారు.
Trisha: త్రిష..పాన్ ఇండియా హీరోయిన్
It's disgusting to repeatedly see low lives and despicable human beings who will stoop down to any level to gain https://t.co/dcxBo5K7vL assured,necessary and severe action will be taken.Anything that needs to be said and done henceforth will be from my legal department.
— Trish (@trishtrashers) February 20, 2024
‘‘అటెన్షన్ కోసం కొందరు ఎంతో నీచంగా ప్రవర్తిస్తారు. ఎంత స్థాయికి అయిన దిగజరతారు. ఇలాంటి వారిని చూస్తుంటే అసహ్యాం కలుగుతుంది. నేనేం చేయాలనుకుంటున్నానో, ఏం చేస్తానో నా లీగల్ టీమ్(లాయర్ సిబ్బంది) చేస్తారు’’ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు త్రిష. క్షణాల్లో త్రిష పోస్ట్ కూడా వైరల్ అయ్యింది. జాతీయమహిళా కమీషన్ సభ్యురాలు, నటి ఖుష్భూ, హీరో విశాల్, గాయని చిన్మయి లతోపాటు ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు, నెటిజన్లు త్రిషకు సపోర్ట్‌గా కామెంట్స్, పోస్ట్స్ చేశారు.దీంతో ఏవీ రాజు జ్ఞానం బోధపడి తన తప్పు తెలుసుకున్నాడు. త్రిషను క్షమాపణలు కోరుతూ మరో వీడియోను విడుదల చేశాడు.
Trisha Krishnan: ఆచార్యతో బ్రేకప్…విశ్వంభరతో ప్యాచప్
#Trisha #AVRajupic.twitter.com/rkuZqRXaXM
— TollywoodHub (@tollywoodhub8) February 20, 2024
త్రిషను చెల్లి అని పిలిచిన మన్సూర్ అలీఖాన్
హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లోని ‘లియో’ సినిమాలో నటించారు మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan). ఇందులో త్రిష హీరోయిన్గా నటించారు. అయితే ఈ చిత్రంలో త్రిషతో తనకు ఓ రేప్ సీన్ ఉంటేబాగుండేదన్నట్లుగా మన్సూర్‌అలీఖాన్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. త్రిష కూడాఘాటుగానే స్పందించారు. అప్పుడు కూడా త్రిషకు ఇండస్ట్రీ, ఇంటర్నెట్లో మంచి సోపర్ట్ లభించింది.త్రిషకు సపోర్ట్‌గా చిరంజీవి కూడా ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. కానీ త్రిష చర్యల వల్ల తన పరువుకు భంగంకలిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మన్సూర్ అలీఖాన్. అక్కడ కూడా త్రిషకే సపోర్ట్ లభించింది.మన్సూర్ అలీఖాన్‌ను హెచ్చరించింది కోర్టు. మన్సూర్ అలీఖాన్ తప్పు తెలుసుకున్నాడు. ఇక తాజాగా..త్రిష– ఏవీ రాజు వివాదంలో త్రిషకు సపోర్ట్ చేశారు మన్సూర్ అలీఖాన్. అంతేకాదు..చెల్లి త్రిష అంటూమన్సూర్ అలీఖాన్ మాట్లాడటం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.