“
ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రానికి గం.. గం.. గణేశా టైటిల్ ఫిక్సయ్యింది. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రానికి నిర్మాతలు. “గం..గం..గణేశాష చిత్రంతో ఉదయ్ శెట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అవుతున్నారు.
ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ఫిబ్రవరి 7న ప్రారంభమైంది. నిర్మాతలు కేదార్ సెలగంశెట్టి, వంశీ కారు మంచి దర్శకుడు ఉదయ్ శెట్టి కి స్క్రిప్ట్ అందించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెర కెక్కుతోంది. చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. “దొరసాని”, “మిడిల్ క్లాస్ మెలొడీస్”, “పుష్పక విమానం“ వంటి సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆనంద్ దేవరకొండ. ఇక ఆనంద్ చేసిన హైవే ఫిల్మ్ రిలీజ్కు రెడీగా ఉంది.