AlluArjun Pushpa: అదెంటో కానీ ‘పుష్ప’(Pushpa) సినిమాకు లీకుల బెడత వెంటాడుతూనే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో దర్శనం ఇస్తూనే ఉన్నాయి. ‘పుష్ప: ది రూల్’(pushpaTheRule) సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ టీమ్ కంటే ముందే లీకు రాయుళ్ళు సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. దీంతో తప్పక పుష్ప టీమ్ కూడా ‘పుష్ప: ది రూల్’ ఫస్ట్‌లుక్‌ను అనుకున్న సమయానికంటే ఒకరోజు ముందుగా రిలీజ్ చేయాల్సి వచ్చింది.
అలాగే ‘పుష్ప: ది రూల్’ గ్లింప్స్‌లోని ఓ డైలాగ్ ముందుగానే వచ్చేసింది. ‘పుష్ప: ది రూల్’గ్లింప్స్‌ను అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. కానీ గ్లింప్స్ వీడియోలోని ఓ డైలాగ్..అంటే…‘అడవిలోని జంతువులు రెండు అడుగులు వెనక్కి వేసినాయంటే పులి వచ్చినాదని అర్థం…అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసినాడంలే పుష్పవచ్చిండని అర్థం’ అనే డైలాగ్ ముందుగానేసోషల్మీడియాలో వైరల్ అయ్యింది.
ఇప్పుడు మరో డైలాగ్ సోషల్‌మీడియాలో తెగ తీరుగుతుంది. ‘‘చూడప్ప సీనప్ప…పుష్ప గుండెల్లో గుండు దింపాలంటే గన్ ఒక్కటే పట్టుకుంటే సరిపోదప్పా…దాన్ని పట్టుకున్నోడి గుండె కూడా గన్లా ఉండాలప్ప…’ అనే డైలాగ్ ‘పుష్ప: ది రూల్’ సినిమాలో ఉంటుందనిలీకు రాయళ్ళు సోషల్‌మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.
‘‘చూడప్ప సీనప్ప…’డైలాగ్ కూడా ‘పుష్ప 2’లో ఉండే టీమ్ జాగ్రత్త పడక తప్పదు మరి. లీకుల వల్ల టీమ్‌కు కొంత ప్రమోషన్ రావొచ్చు. కానీ నష్టమే ఎక్కువ. ఇది రిలీజ్ సమయంలో కనపడుతుంది. ఆడియన్స్ ఎగై్జట్‌మెంట్ తగ్గిపోతే ఆ ప్రభావం కలెక్షన్స్‌పై పడుతుంది.
ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లోని రూపొందుతున్న ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది. మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్‌ఫాజిల్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.