అల్లు అర్జున్ కెరీర్లో ‘అల..వైకుంఠపురములో…’ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి పోటీగా విడుదలైన మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కలెక్షన్స్‌ను ‘అల..వైకుంఠపురములో..’ బీట్ చేసి 2020లో సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ‘అల..వైకుంఠపురములో..’ చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 17న అల్లు అర్జున్ చేసిన తాజా చిత్రం ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి హిందీలో వచ్చిన పాపులారిటీ, కలెక్షన్స్‌ను దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ ఇలా చేస్తుండవచ్చు. కానీ ఇదే పనిని 2020లోనే చేసి ఉంటే బాగుండేది. కానీ అల్లు అర్జున్ ‘అల ..వైకుం ఠపు రములో…’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను ఈ నెల 26న థియేటర్స్‌లో విడుదల చేస్తుండటం నైతిక విలువలకు తూట్లు పొడవడమే నని చెప్పవచ్చు.
Chiranjeevi Acharya New Release Date Locked
‘అల..వైకుంఠపురుములో..’ సినిమా 2020లో విడుదలైన వెంటనే ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను దక్కించుకున్నారు బాలీవుడ్ నిర్మాత మనీష్. కార్తిక్ ఆర్యన్, కృతీసనన్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల స్టార్ట్ అయ్యింది. రోహిత్ ధావన్ ఈ చిత్రం దర్శకుడు. ‘షాబాద్’ టైటిల్‌తో, గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఓ నిర్మాతగా రూపొందుతున్న ‘అల..వైకుంఠపురములో..’ హిందీ రీమేక్ ఈ ఏడాది నవంబరు 5న విడుదలకు రెడీ అయ్యింది. కానీ ‘పుష్ప: ది రైజ్’ సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుని ‘అల..వైకుంఠపురుములో..’ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను ఈ నెల 26న థియేటర్స్‌లో విడుదల చేయ డానికి అల్లు అర్జున్ అండ్ కో రెడీ అయ్యారు. దీంతో..ఒక సినిమా హిందీ రీమేక్ రైట్స్ తీసుకుని, అదీ
నిర్మాణంలో ఉండగానే ఇలా..ఈ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను థియేటర్స్‌లో విడుదల చేయడం అనేది ఈ నైతికం అని నెటిజన్లు అల్లు అర్జున్‌పై మండిపడుతున్నారు. ఈ మరి..ఈ రీమేకింగ్ కథ ఎక్కడికి వెళ్లి చేరుతుందో చూడాలి.