రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’(రౌద్రం..రణం..రుధిరం)కు సంబంధించిన ప్రమోషన్‌ను మెల్లిగా మొదలుపెడుతున్నారు ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల పాత్రలకు సంబంధించిన టీజర్‌లు, ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో పాటు..వీరిద్దరి కాంబి నేషన్‌లోని ‘ఆర్‌ఆర్‌ఆర్’ పోస్టర్స్ కూడా విడుదల అయ్యాయి. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసేందుకు సిద్ధమైయ్యారు రాజమౌళి. ఈ మేకింగ్ వీడియోను ‘రోర్ ఆఫ్ ఆర్‌ఆర్‌ఆర్’ గా ఈ నెల 15న ఉదయం 11గంటల 11 నిమిషాలకు విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ మేకింగ్ వీడియోతో పరోక్షంగా చిత్రయూనిట్ ప్రమోషన్ స్టార్ట్ చేసినట్లే. భారతీయ, విదేశీ భాషల్లో కలిసి మొత్తం 14 భాషల్లో ఈ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం విడుదల కానుంది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొం దుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు.
1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన విదేశీ నటి ఓలివియా మోరిస్ కనిపించనుండగా, రామ్‌చరణ్‌తో బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ జోడీ కట్టారు. అజయ్‌దేవగన్, సముద్రఖని, రాహుల్ రవీంద్రన్, శ్రియలతో పాటుగా విదేశీ యాక్టర్స్ అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ ‘ఆర్‌ఆర్ ఆర్’ చిత్రంలో నటించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్ రెండు పాటలు మినహా పూర్తయింది. ఈ ఏడాది అక్టోబరు 13న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.