‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరీ’ సినిమాలు వెంకీ కెరీర్లో బ్లాక్‌బస్టర్ ఫిల్మ్స్. వెంకీని ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గర చేసిన సినిమాలు ఇవి. వెంకటేష్ కామెడీ డైలాగ్స్,టైమింగ్ ఆడియన్స్‌ను బాగా నవ్వించాయి. ఇంకా నవ్విస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలకు అప్పట్లో ఇప్పటి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు మాటల రచయిత. త్రివిక్రమ్ దర్శకుడిగా మారి, హిట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. అప్పట్నుంచి వెంకటేష్– త్రివిక్రమ్ కాంబినేషన్లోని సినిమాను గురించిన వార్తలు వస్తున్నాయి. 2017లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 6గా ప్రకటన కూడా వచ్చింది. వెంకీ కెరీర్‌లోని మరో బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘సుందరాకాండ’ తరహాలో ఈ చిత్రంలో వెంకీ కూడా ఫిజిక్స్ టీచర్‌గా నటి స్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. కానీ సినిమా మాత్రం
సెట్స్‌పైకి వెళ్లలేదు.
ఆ తర్వాత వెంకటేష్ కెరీర్‌లోని 75వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. కానీ ‘సైంధవ్’ టైటిల్‌గా, శైలేష్ కొలను వెంకీ 75వసినిమాను తీశాడు. అయితే ‘సైంధవ్’ తర్వాత వెంకీ తర్వాతి చిత్రం ఇంకా కన్ఫార్మ్ కాలేదు. ఇటు మహేశ్‌బాబు ‘గుంటూరుకారం’ తర్వాత త్రివిక్రమ్ ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్‌తో ఓ అఫిషియల్ కమిట్మెంట్ ఉన్నప్పటికీని ఇందుకు ఇంకాస్త టైమ్ పట్టేలా ఉంది. సో…వెంకటేష్‌తో త్రివిక్రమ్ సినిమా చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది.
మల్టీస్టారర్?
వెంకీతో త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా మల్టీస్టారర్ అనే టాక్ తెరపైకి వచ్చింది. వెంకీతో కలిసి నాని స్క్రీన్ షేర్ చేసుకుంటారట. అయితే సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఓ సెకండ్ హీరో లేదా సెకండ్ హీరోయిన్ రోల్ కచ్చితంగా ఉంటుంటాయి. సో…మరి..ఈ సినిమాలో నాని నటిస్తే, అది గెస్ట్ రోల్‌నా? లేక వెంకీతో ఈక్వెల్ రోల్‌నా అనేది తెలియాలి.
రీమేక్..?
గతంలో వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అనగానే హిందీలో అక్షయ్‌కుమార్ చేసిన హిట్ ఫిల్మ్ ‘జాలీఎల్ఎల్బీ 2’, మలయాళ హిట్ ‘డ్రైవింగ్ లైసన్స్’ పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకవేళ వెంకీతో త్రివిక్రమ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్‌ను హ్యాండిల్ చేస్తే..ఇందులో రెండు బలమైన పాత్రలు ఉన్న సంగతి తెలిసిందే. సో..అది మల్టీస్టారరే అవుతుంది. మరి.. త్రివిక్రమ్ చేయనున్నది స్ట్రయిట్ ఫిల్మ్నా? లేక ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్నా? అనేది చూడాలి.