సిల్వర్‌స్క్రీన్‌పైకి మిస్‌వరల్డ్ బ్యూటీలు రావడం కొత్త ఏమీ కాదు. గతంలో సుస్మితాసేన్ వంటి వారు ఇచ్చారు. తాజాగా ఈ జాబితాలో చేరిపోయారు మానుషీ చిల్లర్. ఆల్రెyీ హిందీ మూవీ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’తో సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం అయిన మానుషీ చిల్లర్ ప్రస్తుతం జాన్ అబ్రహాంతో ‘టెహ్రాన్’ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్‌కు వస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌తేజ్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యాడ్ ఫిల్మ్‌మేకర్, సినిమాటోగ్రాఫర్ శక్తిప్రతాప్ హడా ఈ సినిమాకు దర్శకుడు. దేశభక్తి నేపథ్యంలో ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తారు మానుషీ చిల్లర్. అయితే ఈ బ్యూటీకి తెలుగులో ఇదేతొలి చిత్రం కావడం విశేషం. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. పైలైట్ పాత్రలో వరుణ్‌తేజ్ నటిస్తుండగా, రాడార్ ఆఫీసర్‌గా కనిపిస్తారు మానుషీ చిల్లర్. ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది.