VK Naresh Malli Pelli: సీనియర్ యాక్టర్ నరేశ్, పవిత్రా లోకేష్‌ల పెళ్లి గురించి ఇప్పటికే వివిధ రకాలుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల నరేశ్ విడుదల చేసిన వీడియోలు వీరి పెళ్లిని గురించిన చర్చను మరింత రేకేత్తించాయి. అయితే లివింగ్ రిలేషన్షిప్ ఉన్నారని చెప్పుకుంటున్న నరేశ్, పవిత్రా లోకేష్‌ల వీడియోలు ‘మళ్ళీ పెళ్లి’ (VK Naresh Malli Pelli) సినిమాకు సంబంధించినవి. దర్శక–నిర్మాత ఎమ్ఎస్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నరేశ్, పవిత్రా లోకేష్ లు లీడ్ రోల్స్ చేస్తుండటం మరో విశేషం. మళ్లీ పెళ్లి చిత్రం మే నెలలో విడుదల కానుంది.ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో ఓ స్పష్టత రానుంది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. తెలుగులో ‘మళ్ళీ పెళ్లి’గా, కన్నడంలో మత్తే మధువే గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందకు రానుంది.
రిలీజ్ దగ్గరపడుతున్న తరుణంలో ‘మళ్ళీ పెళ్లి’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు నరేశ్ అండ్ టీమ్. అయితే ఈ టీజర్‌ని బట్టి ఈ చిత్రం నరేశ్ జీవిత సంఘటనలు, ఆయన భార్య రమ్యరఘుపతితో నరేశ్‌కు ఉన్న విభేదాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాను నరేశ్నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే నరేశ్, రమ్యరఘుపతిల మధ్య పరస్పర ప్రత్యారోపణలు మళ్లీతెరపైకి వస్తాయని ఊహించవచ్చు.