సినిమా: విరూపాక్ష
ప్రధాన తారాగణం: సాయిధరమ్‌తేజ్, సంయుక్తామీనన్, సాయిచంద్, రాజీవ్ కనకాల, సునీల్, బ్రహ్మాజీ
దర్శకుడు: కార్తీక్ దండు
నిర్మాణం:బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు, సుకుమార్
సంగీత దర్శకుడు:అజనీష్ లోకనాథ్
విడుదల తేదీ: 21 ఏప్రిల్ 2023.
కథ
1991లో రుద్రవనం గ్రామంలో జరిగే ఓ జాతర కోసం అక్కడికి వస్తాడు సూర్య(సాయిధరమ్‌తేజ్). నందినీ(సంయుక్తామీనన్)తో ప్రేమలో పడతాడు. ఇంతలో రుద్రవనం గ్రామంలో వరుస ఆత్మహాత్యలు జరుగుతుంటాయి. అయితే ఇవి ఆత్మహాత్యలు కావని, క్షుద్రప్రయోగం వల్ల జరిగే హాత్యలని గ్రహిస్తాడు. ఈ హాత్యల వరుస క్రమంలో తర్వాతి మరణం నందినీదే అని తెలుసుకుంటాడు సూర్య. క్షుద్రప్రయోగం నుంచి రుద్రవనంను సూర్య ఏ విధంగా రక్షించాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో అతను తెలుసుకున్న షాకింగ్ విషయాలు ఏమిటి? అసలు ..రుద్ర వనం గ్రా మంపై క్షుద్రప్రయోగం చేసి ఆ గ్రామప్రజలను చంపాలనుకున్న సూత్రధారులు ఎవరు? పుష్కరకాలం క్రితం రుద్రవనంలో జరిగే ఓసంఘటనకు, 1991లో జరిగే జాతరకు ఉన్న సంబంధం ఏమిటి? అనేది ‘విరూపాక్ష’ సినిమా చూడాలి.
విశ్లేషణ
1979 సిద్దార్ధ నామ సంవత్సరంలో రుద్రవనంలో జరిగే ఓ సంఘటనతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత వెంటనే కథను దర్శకుడు 1991లోకి తీసుకుని వెళ్తాడు. కథ అంతా 1991 నేపథ్యంలోనే సాగుతుంది. సినిమా మొదలైన తర్వాత సూర్య, నందినీల మధ్య లవ్ ట్రాక్, ఈ ట్రాక్‌లో మరో లవ్ ట్రాక్ (సింధు, కుమార్) ప్రేక్షకులకు అంతగా ఆసక్తికరంగా అనిపించవు. అయితే ఎప్పుడైతే రుద్రవనం అమ్మవారి దేవాలంలో మరణం సం భవిస్తుందో అప్పట్నుంచి కథ వేగం పుంజుకుంటుంది. వరుసహాత్యలు జరగడం, వీటిని హీరో సూర్య చేధించడం కారణం కనుక్కోవడం చకా చకా జరిగిపోతాయి. ఇకసెకండాఫ్ మొదలవ్వగానే 1979లో జరిగిన సంఘటన తాలుకూ వ్యక్తుల అన్వేషణకు హీరో మరో ఊరికి వెళ్లడం, క్షుద్రప్రయోగం ప్రతిఘటనకు రుద్రవనంలో అష్టదిగ్భదనం కాన్సెప్ట్ ప్రేక్షకులకు కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తాయి. సెకండాఫ్ స్క్రీన్ ప్లే వేగంగా ముందుకు వె ళ్తుంటుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్‌లు, మలుపులు బాగుంటాయి. అయితే క్లైమాక్స్‌లో ప్లాష్‌బ్యాక్ ఏపిసోడ్‌ను చెప్పడం, అప్పటివరకూ ఎంతో పక్కాగా క్షుద్రప్రయోగం చేసిన ప్రధాన సూత్రధారి హీరోకి ప్రేమతో హీరోకి లొంగిపోయి, తనను చంపమని హీరోకే హింట్ ఇవ్వడం, అప్పటివరకూ క్షుద్రప్రయోగం చేసిన ప్రధాన సూత్రధారికి ప్రతిఘటించేందుకు హీరోకు హెల్ప్ చేసిన అఘోర పాత్ర సడన్‌గా మాయం కావడం వంటికి అంతగా కథకు అతకలేదు. అలాగే రుద్రవనం గ్రామ పూజరికి మారిన గ్రంథంలోని నియమ, నిబంధనలు క్షద్రపూజ ప్రతిబింబకాలని కనీస అవగాహన లేక పోవడం వంటివి ఆడియన్స్‌ను కాస్త తికమకపట్టే ప్రశ్నలే. రొమాంటిక్ సీన్స్, కామెడీ, భారీ ఫైట్స్ ఎలాగూ ఉండవని చిత్రబృందం చెప్పారు కనుక వీటి గురించి పెద్దగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. మొత్తంగా సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే వారికి ‘విరూపాక్ష’ నచ్చుతుంది. అయితే ఈ చిత్రం పెద్దలకు మాత్రమే. ఈ సినిమాలోని కొన్ని భయంకర సన్నివేశాలు చిన్న పిల్లలను భయపడేలా ఉన్నాయి.
పెర్ఫార్మెన్స్
ఈ సినిమా మేజర్ క్రెడిట్ కథకు, స్క్రీన్ ప్లే ఇచ్చిన సుకుమార్‌కు దక్కుతుందనే చెప్పాలి. కథాపరంగా కొన్ని లోపాలు ఉన్నప్పటికీని దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే కార్తిక్ దండు పాజిటివ్ మార్కులు వేయించుకున్నాడు. ట్విస్ట్‌లు, ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాలో బాగా రాసు కున్నా డు. కానీ క్షుద్రప్రయోగం చేసే వ్యక్తే ఆ ప్రయోగానికి గురై చనిపోతున్నట్లుగా, ఆ వ్యక్తిని హీరో కాపాడినట్లుగా చూపించడం అనేది ముమ్మాటికీ ఆడి యన్స్ తప్పుదోవపట్టించడం అనే చెప్పుకోవాలి. క్షుద్రప్రయోగం చేసే వ్యక్తే చనిపోతే కథ అంత ఎందుకు? అనిపిస్తుంది సగటు అభిమానికి. ఇకహీరోగా అనే కంటే కథకు అవసరమైన ప్రధాన లీడ్ రోల్లో సాయిధరమ్‌తేజ్ మెప్పించాడు. డైలాగ్ డెలివరీలో కాస్త బేస్ ఉంటే ఇంకొంచెం బాగుండేది. కథలో మేజర్‌గా చెప్పుకోవాల్సింది సంయుక్తామీనన్ గురించి. మూర్చ రోగిగా నందిని బాగా నటించారు. ప్రీ క్లైమాక్స్ వరకూ సంయుక్తాకు యాక్టింగ్ పరంగా స్కోప్ లేదు కానీ క్లైమాక్స్‌లో రెచ్చిపోయారు. ఇక ఇలాంటి హారర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ విషయంలో బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి కచ్చితంగా ప్రస్తావించుకోవాల్సిందే. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన హైలైట్. గ్రాఫిక్స్, సీజీ వర్క్స్ కూడా బాగున్నాయి. ఇక ఊరికి సర్పంచ్‌గా రాజీవ్‌కనకాల, అబ్బాయి రాజుగా సునీల్, ఆర్ఎమ్పీ డాక్టర్‌గా బ్రహ్మాజీ తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. కెమెరామాన్ సైనూద్దీన్ ప్రతిభను ఏ మాత్రం తక్కువ చేసి చెప్పలేం. విరూపాక్ష సినిమాకు వంద శాతం న్యాయం చేశారని విజువల్స్ చెబుతున్నాయి
బలాలు
- కథ, స్క్రీన్ ప్లే
- సంయుక్తా మీనన్ నటన
- బ్యాగ్రౌండ్ స్కోర్
బలహీనతలు
- లవ్‌ట్రాక్
- కొన్ని లాజిక్ మిస్ కావడం
ఫైనల్‌గా: విజయం సాధించిన విరూపాక్ష(2.75)