Vishwaksen Gaami Review:: కొన్ని రోజులుగా ‘గామి’ సినిమాను ఇండస్ట్రీలో ఓ ప్రయోగాత్మక సినిమా చెప్పుకుంటారు. అందులోనూ ఇప్పటివరకు యాటిట్యూడ్ ఉండే ఓ మాస్ కుర్రాడి పాత్రలే చేసిన విశ్వక్సేన్ తొలిసారిగా అఘోరాగానటించడంతో ‘గామి’ౖపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. విడులైన ట్రైలర్ ‘గామి’ అంచనాలను మరింత పెంచింది. మరి..‘గామి’ (Vishwaksen Gaami Review) రూపంలో విశ్వక్సేన్ ఖాతలో మరో హిట్ చేరిందా? రివ్యూలో చదివేద్దాం….
సినిమా: గామి
ప్రధాన తారాగణం: విశ్వక్సేన్, చాందినీ చౌదరి, హారిక, మహమ్మద్ సమద్, మయాంక్ పరాగ్
దర్శకుడు: విద్యాధర కాగిత
నిర్మాతలు: కార్తీక్ శబరీష్, కొంత క్రౌడ్ ఫండింగ్
సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్ రెడ్డి సీహెచ్, రాంపీ నందిగాం( కో–డీవోపీ)
ఎడిటింగ్: రాఘవేంద్ర తిరున్
మ్యూజిక్ : స్వీకర్ ఆగస్తి, నరేష్ కుమరన్, ఆర్ఆర్: నరేష్ కుమరన్
విడుదల: మార్చి 8, 2024
కథ
హరిద్వార్‌లోని ఓ ఆశ్రయంలో అఘోరా శంకర్ నివాసం ఉంటుంటాడు. కానీ మానవ స్పర్శను ఏమాత్రం తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు శంకర్. దీంతో శంకర్ వల్ల తమకు ఏదైనా ప్రమాదం జరుగుతుందెమోనన్న భయంతో శంకర్‌ను ఆ ఆశ్రమం నుంచి వెళ్లిపోమంటారు తోటి అఘోరాలు. కానీ ఈ అరుదైన సమస్యకు పరిష్కారం హిమయాలల్లోని ద్రోణగిరిలో లభించే మూలపత్రిక పుష్పాలే అని తెలుసుకుంటాడు శంకర్. వీటిని సాధించేందుకు హిమాలయాలకు బయలుదేరతాడు. శంకర్ ప్రయాణానికి
డాక్టర్ జాహ్నవి తోడవుతుంది. అయితే తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో శంకర్ ఆలోచనల్లో ఉమ, సబ్జెక్ట్ సీటీ –333 పదే పదే గుర్తువస్తుంటారు. మరి…శంకర్ హిమాలయాలకు వెళ్లి తన సమస్యను ఏ విధంగా పరిష్కరించుకున్నాడు? శంకర్‌కు డాక్టర్ జాహ్నవికి ఉన్న సంబంధం ఏమిటి? సబ్జెక్ట్ సీటీ 333 (మహ్మద్ సమద్), ఉమ(హరీక)లు కేవలం శంకర్‌కే తమ బాధలను ఎందుకు చెప్పుకుంటారు? శంకర్, సబ్జెక్ట్ సీటీ 333, ఉమల మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? అనేది సినిమాలో చూడాలి.
ఒకే సినిమాలోమూడు కథలు సామాంతరంగా సాగుతూ క్లైమాక్స్‌లో ఓ పాయింట్‌కు కనెక్ట్ అయ్యే కథలు కొన్ని ఉన్నాయి. తెలుగులో ‘వేదం’ సినిమాను ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ‘గామి’ కథ కూడ ఇంచు మించు అలాంటిదే. అఘోరాగా బాధపడుతున్న శంకర్, దేవదాసీ వ్యవస్థ నుంచి విముక్తి కోరుకుంటున్న ఉమ, ఇండో– చైనా బోర్డర్లో ఓ ప్రయోగశాలలో ఓ సబ్జెక్ట్‌గా ఓ కొత్త ప్రయోగానికి వాడబడుతున్న సీటీ– 333..ఈ మూడు కథలు ‘గామి’ సినిమాలో సమాంతరంగా సాగి, క్లైమాక్స్‌లో ఓ కనెక్టింగ్ ట్విస్ట్‌తో ముగు స్తుంది. స్క్రీన్ ప్లే డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ దర్శకుడు విద్యాథర ఇక్కడే ప్రతిభ చూపారు. శంకర్ పాత్రకు హరిక, సీటీ–333 పాత్రలను ఎప్పటికప్పుడు కనెక్ట్ చేస్తూ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు విద్యాదర సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా హిమాలయాల్లో విశ్వన్, చాందీనీల సాహసయాత్ర ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది. ఈ సన్నివేశాలను మినహాయిస్తే సినిమా కాస్త స్లోగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలను ఊహింవచ్చు. ఇంట్రవెల్ సీన్ ఆసక్తికరంగా ఏమీ ఉండదు.సెకండాఫ్‌లో కొంత ల్యాగ్ ఉంది. కానీ సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది.
శంకర్‌గా విశ్వక్ యాక్టింగ్‌లో ఇచ్చిపడేశాడు. ముఖ్యంగా హిమలయాల్లోని బ్యాక్‌డ్రాప్ సీన్స్, రోప్ సాయంతో విశ్వక్, చాందినీ చేసే సీన్స్ భలేగా అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించారు విశ్వక్. డాక్టర్ జాహ్నవిగా చాందినీ చౌదరి బాగా చేశారు. కానీ ఉమ పాత్ర బాగా గుర్తుండిపోతుంది ప్రేక్షకులకు. ఈ పాత్రలో హారిక యాక్టింగ్ అదుర్స్. విశ్వక్, హారికలకు పోటాపోటిగా ఉండే మరో పాత్ర సబ్జెక్ట్ సీటీ 333ని మహమ్మద్ సమద్ అద్భుతంగా చేశాడు. అభినయ, మయాంక్ వారి వారి పాత్రల్లో పరిధిమేర మెప్పించారు.
ఇక ‘గామి’ సినిమా టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్. ఈ విషయంలో దర్శకుడు విధ్యాధర ప్రయత్నాన్ని మెచ్చు కోవాల్సిందే. మూడు కథలను కనెక్టింగ్ను ఆడియన్స్‌కు బాగానే చెప్పారు. కానీ కొన్ని లాజిక్‌లు, ప్రశ్నలు మిగిలిపోతాయి. విశ్వనాథ్‌రెడ్డి, రాంపీ నందిగంల సినిమాటోగ్రఫీ, నరేష్కుమరన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ‘గామి’ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఎడిటింగ్ ఒకే. తక్కువ బడ్జెట్‌తో బాగానే తీశారు సినిమాను. క్రౌడ్ ఫండింగ్ జరిగినా ఏ మాత్రం మేకింగ్‌లో రాజీ పడని విధ్యాధర ధైర్యం అభినందనీయం. నిర్మాత కార్తీక్ సాహసం ప్రశంసనీయం. ఓవరాల్‌గా ‘గామి’ చిత్రం తెలుగు ఆడియన్స్‌కు ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.
బలాలు
కథ
విశ్వన్, హారిక,సమద్ల యాక్టింగ్
సినిమాటోగ్రఫీ, ఆర్ఆర్
బలహీనతలు
పేలవమైన ఇంట్రవెల్
కొన్ని రోటీన్, ఊహాజనిత సన్నివేశాలు