ఇటీవల మలయాళంలో విడుదలైన ‘ప్రేమలు’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఐదుకోట్ల రూపాయల బడ్జెట్‌తోనే రూపొందించిన ఈ చిత్రం వందకోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దిశగా దూసు కెళ్తోంది. ఇటీవల ఈ సినిమాను తెలుగులో ‘ప్రేమలు’గా అనువాదం చేశారు. ప్రముఖ దర్శకులు రాజమౌళి తనయుడు, ‘ఆర్ఆర్ఆర్’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తికేయ తెలుగు ‘ప్రేమలు’ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందకు తీసుకువచ్చారు. తెలుగు ‘ప్రేమలు’ మార్చి 8న విడుదలైంది. మరి.. తెలుగు ‘ప్రేమలు’ సినిమా ఎలా ఉందో రివ్యూలో చదివేద్దాం….
సినిమా పేరు: ప్రేమలు (Premalu Review)
ప్రధాన తారాగణం: నస్లెన్ కె. గఫూర్, మమితా బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, మాథ్య థామస్
దర్శకుడు: గిరీష్ ఏడీ
నిర్మాతలు: ఫాహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్
సంగీత దర్శకులు: విష్ణు విజయ్
కెమెరా: అజ్మల్
ఎడిటింగ్: ఆకాష్ జోసెఫ్, వర్గీస్
జానర్: రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్
నిడివి: 156 నిమిషాలు
కథ
కేరళ కుర్రాడు సచిన్ (నస్లెన్). కాలేజీలో లవ్‌ఫెయిల్యూర్. ఇంట్లో గొడవలు. దీంతో ఫారిన్ వెళ్లాలని వీసాకు అప్లై చేసుకుంటాడు. కానీ రిజెక్ట్ అవుతుంది. దీంతో స్నేహితుడు అముల్ (సంగీత్ ప్రతాప్) సలహా మేరకు హైదరా బాద్‌లో గేట్ కోచింగ్‌కు వస్తాడు. మరోవైపు హైదరాబాద్‌లో రీనూ(మమితా బైజు) ఓ సాప్ట్వేర్ ఉద్యోగిని జాయిన్ అవుతుంది. ఆది (శ్యామ్మోహన్) ఆమెకు సీనియర్. రీనూని ఇష్టపడతాడు. గేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లెక్చలర్ పెళ్లిలో సచిన్, అముల్, రేణు, ఆది, కార్తీక (అఖిల భార్గవన్ రేణు ఫ్రెండ్) అందరు కలుసుకుంటారు. ఇక్కడ రీనూని ఇష్టపడతాడు సచిన్. కొన్ని పరిస్థితుల కారణంగా సచిన్, అముల్, కార్తీక, రీనూ ఒకే కారులో పెళ్లి నుంచి తిరుగు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో రీనూ ను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు సచిన్. అలా ఆ తర్వాత సచిన్, రీనూ దగ్గర అవుతారు. రీనూ తనపై చూపించే అభిమానాన్ని సచిన్ ప్రేమగా ఫీలవుతాడు. దీంతో ఓ రోజు రీనూకి ప్రపోజ్ చేస్తాడు. అయితే తనకు కాబోయే భర్తలో ఫలానా క్వాలిటీస్ ఉండాలనుకునే రీనూ మాత్రం సచిన్ ప్రేమను తిరస్కరిస్తుంది. దీంతో సచిన్ నిరుత్సాహపడతాడు. రెండు వరుస లవ్ఫెయిల్యూర్స్, వీసా రిజెక్ట్. ఈ క్రమంలో సచిన్ ఏం చేస్తాడు? రీనూ మళ్లీ సచిన్‌కు దగ్గర అవుతుందా? వీరిద్దరి ప్రేమకథ ఎలా ముగుస్తుంది? అన్నదే ఈ చిత్రం కథ.
సినిమాలో పెద్ద పెద్ద నటీనటులు లేవు. విజువల్ వండర్స్, గ్రాఫిక్స్‌లేవు. యాక్షన్ హంగామా లేనే లేదు. ఉన్నదల్లా మంచి కథ మాత్రమే. కథనే ప్రేమగా ఆడియన్స్‌కు చెప్పాడు దర్శకుడు. ఓ సాధారణ కుర్రాడి కథ, ఓ సాధారణ అమ్మాయి కలలు..అనే నేపథ్యంలోనే సాగుతుందీ కథ. స్టార్టింగ్ కాస్త స్లోగా ఉన్నా పెళ్లి ఎపిసోడ్ నుంచి కథనం వేగం పుంజుకుంటుంది. సచిన్, రీనూల మధ్య వచ్చే సన్నివేశాలు ఎంత బాగుం టాయో… అంతకు మించిన హాస్యం ఉంటుందీ సచిన్–అముల్ క్యారెక్టర్స్ మధ్య. ఆది, ఆముల్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ఆడియన్స్ నవ్వుకుంటారు. అలా డిజైన్ చేశాడు దర్శకుడు ఈ క్యారెక్టర్స్‌ను. పైగా ఈ సినిమాకు హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ ఉండటం తెలుగు ప్రేక్షకుల మరింత నచ్చే, నప్పే, కనెక్ట్ అయ్యే అంశం. దీనికి తోడు ఇటీవల సూపర్‌హిట్ వెబ్‌సిరీస్ 90ని డైరెక్ట్ చేసిన ఆదిత్యాహాసన్ తెలుగు ప్రేమలుకు డైలాగ్స్ ఇచ్చారు. ఇవి బాగానే ఉన్నాయి. రీసెంట్గా సోషల్‌మీడియాలో వైరల్ అయిన ఇన్సిడెంట్స్ను ఆదిత్యా హాసన్ కథలో చక్కగా పెట్టాడు. ఆడియన్స్‌ను మరోసారి నవ్వేలా చేశాడు. అయితే సెకండాఫ్‌లో కాస్త ల్యాగ్ ఉంటుంది. అప్పటిదాగా నవ్వించిన దర్శకుడు సడన్‌గా కాస్త ఎమోషనలైజ్ చేస్తాడు ప్రేక్షకులను. మళ్లీ నవ్విస్తాడు. ఇలా సినిమా ఆద్యంతం ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది.
Manjummel Boys: మంజుమ్మెల్ బాయ్స్…నెంబర్ 2
సచిన్‌గా నస్లెన్ బాగా చేశాడు. కామెడీ సీన్స్ బాగా చేశాడు. కథకు అవసరమైనప్పుడు అమాయకుడిగా కనిపించాడు. ఎమోషనల్గానూ మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక మమితా బైజు అయితే రెచ్చిపోయారు. కొన్ని సన్నివేశాల్లో మమితా బైజు యాక్టింగ్ క్లాప్ కొట్టిస్తుంది. ఆదిగా శ్యామ్మోహన్, అముల్‌గా ప్రతాప్‌లకు మంచి రోల్స్ పడ్డాయి. అఖిల భర్గావ పాత్ర ఒకే. మాథ్యూస్ది గెస్ట్ రోల్లా ఉంటుంది. ఇక దర,‡్శకుడు గిరీష్ ఏడీ హిలేరియస్ రైటింగ్ అదుర్స్ అనే చెప్పాలి. యూత్పల్స్ను బాగా పట్టాడు. మంచి కథ రాసుకున్నాడు. అంతే మంచిగా స్క్రీన్‌పైకి తీసుకువచ్చాడు. విష్ణువిజయ్ల సంగీతం అజ్మల్ కెమెరా బాగున్నాయి. నిర్మాణ విలువలు కొత్త నటీనటులకు తగ్గట్లుగా ఉన్నాయి. కాస్త ఎడిటింగ్ పని మిగిలిపోయిందెమో అనిపిస్తుంది ముఖ్యంగా సెకండాఫ్‌లో.
బలాలు
కథ
హీరోహీరోయిన్ల నటన
కామెడీ
బలహీనత
కొన్ని సన్నివేశాల సాగదీత
కొన్ని ప్రిడెక్టబుల్ సీన్స్