విష్ణువిశాల్ హీరోగా మను ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ‘ఎఫ్ఐఆర్’ తెలుగు ట్రైలర్ను హీరో నాని విడుదల చేశారు. ‘ఎఫ్ఐఆర్’ సినిమా ఈ నెల 11న విడుదల అవుతోంది. రవితేజ, నిర్మాత అభిషేక్ నామా ‘ఎఫ్ఐఆర్’ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇర్ఫాన్ అహ్మాద్ అనే ఓ సాధారణ పౌరుడి జీవితం ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా జీవితం ఆధారంగా ఎలా ప్రభావితం అయ్యింది? అన్నదే ‘ఎఫ్ఐఆర్’ కథ. గౌతమ్వాసుదేవ్ మీనన్, మంజిమా మోహన్, రైజా విల్సన్ కీలక పాత్రలు పోషించారీ చిత్రంలో.