Vetrimaaran: తమిళ స్టార్ హీరో విజయ్ ఫైనల్ సినిమా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయిపోనట్లు తెలుస్తోంది. తమిళంలో ‘అడుకాలమ్’, ‘అసురన్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్హీరోగా నటించనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. విజయ్ లాస్ట్ సినిమాకు దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజు, హెచ్.వినోద్ వంటి దర్శకుల పేర్లు వినిపించినప్పటికీని ఫైనల్‌గా ఈ అవకాశాన్ని మాత్రంవెట్రిమారన్ దక్కించుకున్నారని సమాచారం. ఈ సినిమాను తెలుగు నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించ నున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక ప్రస్తుతంవిజయ్ ‘ది గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. వెంకట్‌ప్రభు ఈ సినిమాకు దర్శకుడు.ఇటు వెట్రిమారన్ కూడా యాక్టర్ సూరితో ‘విడుదలై పార్టు 2’ తీస్తున్నారు. ‘విడుదలై పార్టు 2’ షూటింగ్పూర్తయింది. మరోవైపు సూర్యతో ‘వాడివాసల్’ సినిమాకు కమిటైయ్యారు వెట్రిమారన్ గతంలో. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలైయ్యాయి. కానీ విజయ్‌తో వెట్రిమారన్ సినిమా చేస్తున్నారుకాబట్టి సూర్య ‘వాడివాసల్’ సెట్స్‌పైకి వెళ్లడానికి మరింత సమయం పడుతుందని ఊహించవచ్చు.
ఇక విజయ్ ఇటీవల తమిళగ వెట్రి కళగం అనే రాజకీయపార్టీని స్థాపించారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా విజయ్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక తాను పూర్తి స్థాయి లోరాజకీయాలు చేస్తానన్నట్లుగా గతంలో విజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.