వరుణ్‌తేజ్ సోలో హీరోగా నటించిన ‘గని’, ‘గాంఢీవదారి అర్జున’ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైయ్యాయి. దీంతో తన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలైంటెన్’పైనే తన ఆశలు
పెట్టుకున్నాడు వరుణ్‌తేజ్. భారతవైమానిక దళం నేపథ్యంలో సాగే ఈ చిత్రంతో మానుషీ చిల్లర్ హీరోయిన్గా నటించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలైట్‌గా వరుణ్‌తేజ్, రాడార్
ఆఫీసర్‌గా మానుషీ చిల్లర్ నటించారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాతో శక్తి ప్రతాప్‌సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆపరేషన్ వాలైంటెన్ చిత్రం హిందీ
లో వరుణ్‌తేజ్‌కు తొలి చిత్రం కాగా, మానుషీకి తెలుగులో తొలి చిత్రం కావడం విశేషం. అయితే వరుణ్‌తేజ్ నటించిన ఈ తాజా చిత్రాన్ని డిసెంబరు 8న విడుదల చేయాలనుకు
న్నారు. కానీ ఈ చిత్రం వాయిదా పడింది. ఆపరేషన్ వాలైంటెన్ సినిమాను ఫిబ్రవరి 16నరిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటంచారు. ఇలా సిల్వర్‌స్క్రీన్‌పై వరుణ్‌తేజ్ ఆపరేషన్
వాయిదా పడింది. ఇటీవల లావణ్యాత్రిపాఠిని వివాహం చేసుకున్న వరుణ్‌తేజ్ ప్రజెంట్ ఫారిన్లో హానీమూన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తిరిగి రాగానే వరుణ్ ‘మట్కా’ సిని
మా చిత్రీకరణలో పాల్గొంటారు. ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ ఈ సినిమాకు దర్శకుడు.
You Might Also Like
Hero Ram 22 Movie Opening: రామ్ కొత్త చిత్రం ప్రారంభం
November 23, 2024
Zebra Movie Review: జీబ్రా మూవీ రివ్యూ- నాలుగు రోజుల్లో ఐదు కోట్లు
November 22, 2024