కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డెవిల్’. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో రూపొందు తున్న సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. సంయుక్తామీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో,మాళవిక నాయర్ ఓ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. పీరియాడికల్స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
దేవర టీజర్ సిద్ధం అవుతుంది: కళ్యాణ్‌రామ్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాకు ఓ నిర్మాణభాగస్వామిగా ఉన్నారు కళ్యాణ్‌రామ్. అయితే హైదరాబాద్‌లో జరిగిన ‘డెవిల్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ‘దేవర’ అప్డేట్ గురించికళ్యాణ్ రామ్ మాట్లాడారు. ఈ సినిమా టీజర్ సిద్ధం అవుతుందని, వీఎఫ్ఎక్స్ పనులుపై టీజర్ అనౌన్స్మెంట్ ఉంటుందన్నట్లుగా పేర్కొన్నారాయన. అయితే సంక్రాంతికి ‘దేవర’ టీజర్ విడుదల కానున్నట్లుగాతెలుస్తోంది. కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలకానుంది. తొలిభాగం ఏప్రిల్‌లో విడుదల కానుంది. కొసరాజు హరికృష్ణ, మిక్కినేని సుధాకర్ నిర్మిస్తున్నఈ సినిమాతో జాన్వీకపూర్ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు.
బింబిసార సీక్వెల్ ఉంటంది
కళ్యాణ్‌రామ్ కెరీర్‌ను హిట్ట్రాక్లోకి తెచ్చిన చిత్రం ‘బింబిసార’. ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే బింబిసార సినిమా సీక్వెల్ వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభంఅవుతుందని, బింబిసార సినిమాకు దర్శకత్వం వహించిన మల్లిడియే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారా? లేదా? అనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుందని చెప్పుకొచ్చారు కళ్యాణ్‌రామ్.