సందీప్‌కిషన్, విజయ్ సేతుపతి హీరోలుగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ మైఖేల్
. ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక తమిళం దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ కీ రోల్ చేయనున్న ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రకు వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను తీసుకున్నారు. నారాయణ్ దాస్ కే నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కర్ రామ్ మోహన్ రావు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మలి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మరోవైపు ఇటీవలే కరోనా బారిన పడ్డ వరలక్ష్మీ కోలుకున్న సంగతి తెలిసిందే.
మైఖేల్‌లో వరలక్ష్మీ
Leave a comment
Leave a comment