‘అల్లరి’ కెరీర్‌ను సీరియస్ ట్రాక్‌లో పెట్టిన చిత్రం ‘నాంది’. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకుడు. ఓ సామాజిక అంశంతో ఆలోజింపచేసేలా థియేటర్స్‌లోకి వచ్చిన ‘నాంది’ ఇండస్ట్రీలో మంచి హిట్‌గా నిలి చింది. అయితే ఇప్పుడు ‘అల్లరి’ నరేశ్, విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఉగ్రం’(ugram). హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ‘ఉగ్రం’ సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ‘డైలీ మనం మిస్సింగ్కేసులను గురించిన వార్తలను చూస్తూనే ఉన్నాం. తెలంగాణ హై కోర్టు కూడా మిస్సింగ్ పర్సన్స్ ఏమౌ తున్నారో నివేదిక ఇవ్వమని పోలీసు శాఖను ఆదేశించింది అన్నట్లుగా వార్తలు ఉన్నాయి’ ఈ నేపథ్యంలో ఉగ్రం కథను అల్లుకు న్నాను అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విజయ్ కనకమేడల.షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహుగారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ‘ఉగ్రం’ సినిమా మే 5న విడుదలకానుంది.
ఆదిశార్మ, సిద్ధి ఇద్నానీ, యోగితా, సోనియా ప్రధాన తారగణంగా రూపొందిన చిత్రం ‘ది కేరళస్టోరీ’.అమ్మాయిల హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా ఈ చిత్రం దర్శకుడు సుదీప్తోసేన్ పేర్కొన్నారు. కేరళలో మిస్ అవుతున్న హిందూ అమ్మాయిలు బలవంత మతమార్పుడులతో ఉగ్రవాద చర్యల్లో ఎలా భాగస్వామ్యులు అవుతున్నారు? అనే కోణంలో ఈ సినిమాకథ ఉంటుందట. విపుల్ షా నిర్మించారు. మరి..ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన హ్యూమన్ ట్రాఫి
కింగ్ డ్రామా ‘ఉగ్రం’ ప్రేక్షకులను అలరిస్తుందా? లేక ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూతో రూపొందిన‘ది కేరళస్టోరీ’ బాక్సాఫీస్ హిట్ కొడుతుందా? అనేది చూడాలి. అయితే ‘ది కేరళస్టోరీ’ చిత్రంహిందీలో రిలీజ్ అవుతుండగా, ‘ఉగ్రం’ సినిమా తెలుగులో విడుదల అవుతుంది.