The Kerala Story సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఓ హాట్‌టాపిక్‌గా నిలిచిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’(The Kerala story). హీరోయిన్స్ ఆదాశర్మ(Adah sharma), సిద్ది ఇద్నానీ, యోగితా బిహాని, సోనియా బలానీ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమాలో నటించారు. సుదీప్తోసేన్ దర్శకత్వం వహించారు. విఫుల్ షా నిర్మాత. ‘ది కేరళస్టోరీ’ సినిమా టీజర్ నవంబరు 3, 2022లో విడు దల చేశారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఏ’ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం మే 5న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 26న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘ది కేరళ స్టోరీ’ ట్రైలర్ వచ్చినప్పటినీ నుంచి ఈ సినిమాపై వివాదం ఏర్పడింది.
వివాదం
కొన్ని సంవత్సరాలుగా కేరళలో 32వేల మంది అమ్మాయిలు అదృశ్యమైయ్యారని, ఇలా కనిపించకుండ పోయిన వారందరికీ బలవంతంగా మత మార్చిడి జరిగి, భారత శత్రుదేశాల ఉగ్రవాద కార్యకలాపాలకువర్క్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయట. ఈ కోణంలో ఓ ముగ్గురు అమ్మాయిల కథలను ఇతివృత్తంగాతీసుకుని దర్శకుడు సుదీప్తో సేన్ ‘ది కేరళస్టోరీ’ సినిమాను తెరకెక్కించారు. అయితే ‘ది కేరళస్టోరీ’ ట్రైలర్లో చూపించిన విధంగా కేరళలో జరగడం లేదని, కేరళరాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకే ‘ది కేరళస్టోరీ’ సినిమాను తీశారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెబుతున్నారు.
దర్శకుడి స్పందన
‘‘ది కేరళస్టోరీ’ సినిమా కథను నిర్మాత విఫుల్ షాకు చెప్పినప్పుడు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. భావోద్వేగానికి లోనైయ్యారు. కథ నచ్చి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కోసం దాదాపు ఏడు సంవత్సరాలు కష్టపడ్డాం. చాలా పరిశోధన చేశాను. ఈ సినిమాలో ముగ్గురు అమ్మాయిల కథను చెబుతున్నాం. అమ్మాయిల ట్రాఫికింగ్ అనేది ఒక్క ఇండియాలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఈ కాన్సెప్ట్‌ను మా సినిమాకు తీసుకున్నాం. కేవలం ట్రైలర్ మాత్రమే చూసి, ‘ది కేరళస్టోరీ’ చిత్రం ఓప్రొపగండ ఫిల్మ్‌గా చెప్పవద్దు. పూర్తి సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాలను వ్యక్తం చేయండి.అయినా ఓ దురాలోచనతో సినిమాను నిర్మిస్తే, అది ఒకవేళ బ్యాన్ చేయబడితే నిర్మాతకు చాలానష్టం. అలాంటి సినిమాను ఎవరూ నిర్మించాలనుకోరు. అయిన ప్రపంచవ్యాప్త సర్వేలు, సూచిలు, అక్షరాస్యతల అంశాల్లో కేరళరాష్ట్రం ముందు ఉంటుంది. కేరళలో ఇంకా విడుదల కాని ఓసినిమాను గురించి కొందరు నెగటివ్‌గా ఆలోచిస్తారని నేనూ ఊహించలేదు’ – దర్శకుడు సుదీప్తోసేన్.
Pyar and Propoganda ❤ full video on youtube #TheKeralaStory #AskAdah pic.twitter.com/klOxMzBFK5
— Adah Sharma (@adah_sharma) April 29, 2023
కొందరు రాజకీయనాయకులు ‘ది కేరళస్టోరీ’ సినిమా ప్రదర్శనపై వ్యతిరేకంగా ఉన్నారు. మరి..ఈ తరుణంలో ‘కేరళస్టోరీ’ చిత్రం విడుదలై విజయం సాధిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.