Thalapathy Vijay : విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘వారిసు’(తెలుగులో ‘వారసుడు’). రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మించారు. సంక్రాంతిసందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళం భాషల్లో ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వారిసు’, ‘వారసుడు’ ట్రైలర్స్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న సిని మాలో జయరాం, జయసుధ, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, ‘కిక్’ శ్యామ్ కీ రోల్స్ చేశారు.
ఇక ‘మాస్టర్’ చిత్రం తర్వాత హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతుంది. ఈ సినిమా విజయ్ కెరీర్‌లో 67వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమాతో విజయ్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తారని, ఆల్రెడీ షూటింగ్ మొదలైన ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారన్నది కోలీవుడ్ టాక్. అయితే ఈ విషయాలపై అధికారిక
సమాచారం అందాల్సి ఉంది.