100 శాతం తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ప్రతి శుక్రవారం కొత్త రిలీజ్‌తో తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం వేలంటైన్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 18న ‘ఆహా’లో కల్ట్ మూవీ ‘96’ విడుదలైంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక తెలుగు సినీ ప్రేక్షకుడు సంతోషపడుతున్నాడు. తమిళ చిత్రమైన ‘96’ను తెలుగులో అనువదించిన మన ప్రేక్షకులకు అందించడంతో ఆహాపై వారు ఎనలేని అభిమానాన్ని కనపరుస్తున్నారు.


ఆహా’ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ విషయానికి వస్తే ..అర్జున ఫల్గుణ, హే జూడ్, ది అమెరికన్ డ్రీమ్, లక్ష్య, సేనాపతి, త్రీ రోజెస్, లాభం, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, అనుభవించు రాజా, సర్కార్, ఛెఫ్ మంత్ర, అల్లుడుగారు, క్రిస్మస్ తాత వంటివన్నీ ప్రస్తుతం ఆహాలో ప్రేక్షకాదరణ పొందుతున్నవే. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షోను ఐఎండీబీ నెంబర్ ఒన్ టాక్ షో గా గుర్తించిన విషయం తెలిసిందే. అలాగే తెలుగు పాటకు ప్రపంచలోనే అతి పెద్ద వేదిక అయిన ఇండియన్ ఐడల్ కార్యక్రమాన్ని ఆహా ప్రీమియర్‌గా ఫిబ్రవరి 25 నుంచి అలరించనుంది. శ్రీరామ చంద్ర ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు
కొంపముంచిన పవన్‌కల్యాణ్..షాక్‌లో అజిత్, వరుణ్‌తేజ్, శర్వానంద్