అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఐపీఎస్ ఆఫీసర్ బన్వర్సింగ్ షెఖావత్ పాత్రలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. అల్లుఅర్జున్, ఫాహద్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ ధనుంజయ, సునీల్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు పార్టులుగా పుష్ప చిత్రం విడుదల కానుంది. తొలిపార్టు పుష్ప ది రైజ్ ఈ ఏడాది డిసెంబరు 17న విడుదల కానుంది.