‘యశోద’ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి హీరోయిన్ సమంత విహారయాత్రకు వెళ్లారు. స్విట్జర్లాండ్‌లోని ఓ హాలీడే రిసార్టులో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు సమంత. ఈ హ్యాపీ మూమెంట్స్‌కు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్‌మీడియాలో షేర్ చేశారు. దీంతో సమంత వేకేషన్‌ను గురించిన విషయం బయటకు తెలిసింది. నాలుగు రోజుల నుంచి సమంత స్విట్జర్లాండ్‌లోనే ఉంటున్నారని తెలిసింది. తిరిగి వచ్చాక ఆమె మళ్లీ యశోద సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతారు. ఈ సినిమాయే కాకుండా… తెలుగు, తమిళంలో ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు సమంత. ఇక సమంత చేసిన ‘శాకుం తలం’, ‘కాదు వాక్కుల రెండు కాదల్’ (తమిళం మూవీ) సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే సమంత హిందీలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వరుణ్‌ధావన్ మెయిన్ లీడ్‌గా ఓ వెబ్‌సిరీస్‌కు సైన్ చేశారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.