బాలీవుడ్‌ హీరో సైఫ్‌అలీఖాన్‌ ‘ఆదిపురుష్‌’ చిత్రంలో రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకుడు. ఇందులో కృతీసనన్‌ హీరోయిన్‌గా కనిపిస్తుంది. మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడు(లంకేశుడు)గా సైఫ్‌అలీఖాన్‌ కనిపిస్తారు. అయితే ఈ సినిమాలో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారు సైఫ్‌అలీఖాన్‌. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 80 రోజుల పాటు జరిగింది. త్వరలో ప్రభాస్‌ వంతు షూటింగ్‌ కూడా పూర్తి కానుంది. అయితే ఈ సినిమాలో గ్రాఫిక్స్‌ వర్క్స్‌కు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. సో…పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌కు ఎక్కువ సమయం పడుతుంది. ఈ ఆదిపురుష్‌ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయాలనుకుంటున్నారు.

By Vissu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *