ఇరవైకోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించబడి 400 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’ అందరి దృష్టిని ఆకర్షించింది. రిషబ్ శెట్టి నటించి, స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ కిరగందూర్ నిర్మించారు. సప్తమిగౌడ హీరోయిన్‌గా నటించగా, అచ్యుత్ కుమార్ కీలక పాత్రధారులు. అయితే ఈ సినిమాను తొలుత 2022 సెప్టెంబరు 30న కన్నడలో విడుదలచేశారు. కన్నడలో మంచి స్పందన రావడంతో ఆ తర్వాత అంటే 2022 అక్టోబరు 15న తెలుగులో విడుదలచేశారు. విడుదలైన ప్రతిచోట కాంతార సూపర్‌డూపర్ హిట్‌ను అందుకుంది.
సాయిధరమ్‌తేజ్ ‘విరూపాక్ష’ సినిమాను కూడా తొలుత పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ పాన్ ఇండియా స్థాయిలో రీసెంట్‌గా విడుదలైన సమంత ‘శాకుంతలం’, నాని ‘దసరా’లకు అంతగా ఆడలేదు. దీంతో కాంతారస్టైల్లోను ఫాలో అవుతున్నారు మేకర్స్. సాయిధరమ్‌తేజ్, సంయుక్తామీనన్ హీరో హీరోయిన్లుగా నటించినఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. 2023 ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి వందకోట్ల రూపాయల సినిమా దూసుకెళ్తుంది. ఈ తరుణంలో ఈ సినిమాను మే 5న హిందీ, తమిళం, మలయాళం భాషల్లో, మే 15న కన్నడ భాషల్లోవిడుదల చేస్తున్నట్లుగా చిత్రంయూనిట్ ప్రకటించింది. ఈ నాలుగు భాషల్లో ఏదో ఒక భాషలో ‘విరూపాక్ష’చిత్రం సక్సెస్ ట్రాక్ ఎక్కిదంటే వందకోట్ల క్లబ్‌లో ‘విరూపాక్ష’ చేరడం అనేది చాలా సులభమైన విషయం. ఇదే జరిగితే సాయిధరమ్‌తేజ్ కెరీర్‌లో తొలిసారి వందకోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన సినిమాగా ‘విరూపాక్ష’ నిలిచిపోతుంది.