విరూపాక్ష (Virupaksha) దర్శకుడు కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేసిన తొలి ఫిల్మ్ ‘భమ్ బోలేనాథ్’. 2015లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో తీవ్ర నిరాశకు గురైయ్యారు దర్శకుడు కార్తీక్. ఇండస్ట్రీలో ఎలాగైనాసరే పేరు సంపాదించుకోవాలని కసిగా కథలు రెడీ చేసుకుంటున్నారు. ఈ సమయంలో అంటే 2016–2017లో గుజరాత్‌లోని ఓ మారుమూల గ్రామంలో ఓ సంఘటన జరిగింది. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఓ మహిళను ఆ ఊరి గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కొడతారు. ఆమె మరణిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించిన్యూస్‌పేపర్‌లో ఆర్టికల్స్ వచ్చాయి. ఈ ఆర్టికల్‌ను చదివారు కార్తీక్ దండు. ఒకవేళ ఆమెకు నిజంగానేచేతబడి చేసే శక్తులు ఉండి, వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఏం చేస్తుందనే ఓ కల్పిత ఆలోచనతోవిరూపాక్ష కథను రెడీ చేసుకున్నారు దర్శకుడు కార్తీక్ దండు. 2017లో తన వెర్షన్ ‘విరూపాక్ష’ స్క్రిప్ట్‌ను రెడీచేసుకుని నిర్మాత కోసం చూస్తున్నారు.
ఈ సమయంలో సుకుమార్‌ని కలిశారు కార్తీక్ దండు. కథ బాగు ందని, అయితే కొన్ని మార్పులు చేయాలని సుకుమార్ సూచించారు. అలాగే తాను ఓ నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తానని కూడా సుకుమార్ చెప్పారు. అలా కార్తీక్, సుకుమార్‌ల కలయికలోని ‘విరూపాక్ష’ఫైనల్ స్క్రిప్ట్ రెడీ కావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. 2019లో విరూపాక్ష ఫైనల్ డ్రాప్ట్ రెడీ అ య్యింది. ఏడు వెర్షన్స్‌ను రాసుకున్నారు సుకుమార్ అండ్ కార్తీక్. అయితే క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్, ట్విస్ట్‌లుసుకుమార్ ఆలోచనలే అంటారు కార్తీక్ దండు.
ఇక విరూపాక్ష కథకు హీరోగా సాయితేజ్‌ను సుకుమార్ ఎంపిక చేశారు. హీరోయిన్ సంయుక్తామీనన్‌ను కార్తీక్ సెలక్ట్ చేశారు. ఈ సినిమాలోని టైటిల్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. రుద్రవనం అంటేశివునిఊరు. హీరోయిన్ పేరు..నందిని. అంటే..శివుని వాహనం (నంది). చీకటిలో ఉన్న ఊరికి వెలుగునిచ్చేవాడు సూర్య(హీరో పేరు) ఇలా ప్రతిదీ ఓ ప్రణాళిక ప్రకారం రెడీ చేసుకున్నారు దర్శకుడు కార్తీక్ దండు. అలాగే కార్తీక్ దండు నిజజీవితంలో జరిగిన ఓ సంఘటన కూడా విరూపాక్ష కథకు మూలంఅయ్యింది.
ప్రచారంలో ఉన్నట్లుగా కార్తీక్ దండు దర్శకుడు సుకుమార్ శిష్యుడు కాదు. సుకుమార్ దగ్గర రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో మాత్రమే వర్క్ చేశాడు కానీ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో కార్తీక్ దండు వర్క్ చేయలేదు.భమ్ బోలేనాథ్‌కు ముందు మాత్రం కార్తీక్‌దండు ‘కార్తికేయ’ సినిమాకు రైటింగ్ డి పార్ట్ మెంట్‌లో ఆ చిత్రం దర్శకుడు చందూమొండేటితో కలిసి వర్క్ చేశారు.