రవితేజ చేస్తున్న తాజా చిత్రాల్లో రావాణాసుర ఒకటి. సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమా కోసం ఎటువంటి సెట్స్ వేయకుండ అన్నీ రియల్ లొకేషన్స్‌లోనే షూటింగ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. ఇందు కోసం హైదరాబాద్‌లోని కొన్ని ప్రముఖ లొకేషన్స్‌ను కూడా పరిశీలించారు. ఇక రవితేజ లాయర్‌గా నటి స్తున్న ఈ చిత్రంలో సుశాంత్, అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, రావురమేష్, మురళీ శర్మ సంపత్‌రాజ్ కీలక పాత్రధారులు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల కానుంది.
You Might Also Like
DeAr Review : డియర్ రివ్యూ
7 days ago