రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘రామారావు అన్ డ్యూటీ’ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రం ద్వారా శరత్ మండవ ఇండస్ట్రీకి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో మండల రెవెన్యూ ఆఫీసర్ రామారావుగా నటిస్తున్నారు రవితేజ. ‘మజిలీ’ చిత్రంలో హీరోయిన్గా నటించిన దివ్యాంకా కౌశిక్ ‘రామారావు అన్ డ్యూటీ’ చిత్రంలో హీరో యిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.


ఈ సినిమాతో పాటుగా ‘వీర’ తర్వాత రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ నటించిన ‘ఖిలాడి’ విడుదలకు సిద్ధమైంది. అలాగే నక్కిన త్రినాథరావు, రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వాల్లో హీరోగా నటిం చేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ చిత్రం రవితేజ కెరీర్లో 68వ చిత్రం. రవితేజ ‘ఖిలాడి’ ఈ ఏడాదే విడుదల కానుంది.

