బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రం సంచలన విజయం సాధించింది. తాజాగా దర్శకుడు రమేష్ వర్మ తన నెక్ట్స్ మూవీని ప్రకటించారు. ఈ సినిమాకు ‘రాక్షసుడు 2’ టైటిల్ ఖరారు చేశారు.‘హోల్డ్ యువర్ బ్రీత్’ అనేది ట్యాగ్‌లైన్. ‘రాక్షసుడు’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నటించనున్న ఓ స్టార్ హీరో పేరు త్వరలో వెల్లడించనున్నారు.
హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ఏ స్టూడియోస్’ అధినేత కోనేరు సత్యనారాయణ ‘రాక్షసుడు 2’ సినిమాను నిర్మించనున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ సి దిలీప్ కెమెరామేన్. శ్రీకాంత్ విస్సా, పాపులర్ సింగర్, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. దర్శకుడు రమేష్‌వర్మ ‘రాక్షసుడు 2’ చిత్రానికి స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సెస్‌ను రామ్ లక్ష్మణ్ పర్యవేక్షిస్తారు