Rajinikanth-Kamalhasaan: ప్రముఖ సంగీత దర్శకులు ఇళయారాజా జీవితం ఆధారంగా ‘ఇళయారాజా’ బయోపిక్ తెరకెక్కుతోంది (Rajinikanth-Kamalhasaan). ధనుష్ టైటిల్ రోల్ చేస్తున్నారు. శ్రీరామ్, భక్తి శరణ్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, ఇలం పరితి గజేంద్రన్, సౌరభ్ మిశ్రాలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చెన్నైలో చిత్రీకరణ మొదలైంది. ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా తీసిన అరుణ్మాథేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సొంత బయోపిక్కు ఇళయారాజాయే సంగీతం అందిస్తుండటం విశేషం.
ఇక ఈ సినిమాకు కమల్‌హాసన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో రజనీకాంత్ ఓ గెస్ట్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇవే నిజ మైతే ‘ఇళయారాజా’ బయోపిక్కు స్క్రీన్ ప్లే పరంగా కమల్‌హాసన్, గెస్ట్ రోల్లో రజనీకాంత్, టైటిల్ రోల్లో ధనుష్ వర్క్ చేస్తున్నట్లే. ఇలా ‘ఇళయారాజా’ బయోపిక్కు కమల్‌హాసన్, రజనీకాంత్, ధనుష్ వర్క్ చేస్తున్నట్లే. ఈ సినిమాను 2025 చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు.