SanjayDutt: కన్నడ స్టార్ యశ్ ‘కేజీఎఫ్: చాఫ్టర్ 2’ సినిమాలో విలన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించారు బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ (SanjayDutt) . అంతే…ఒక్కసారిగా సంజయ్‌దత్‌కు దక్షిణాది నుంచి అవకాశాలు క్యూ కట్టాయి. తమిళ స్టార్ హీరో విజయ్ ‘లియో’లో సంజయ్‌దత్ నటించారు. ఈ సినిమా కంటే ముందే కన్నడ స్టార్ ధృవ్ సర్జా హీరోగా చేస్తున్న ‘కేడీ: డెవిల్’ సినిమాకు కమిటైయ్యారు. ‘లియో’ రిలీజైంది. కానీ ‘కేడీ: డెవిల్’ఇంకా రిలీజ్ కాలేదు.
ఇక సంజయ్‌దత్‌కు తెలుగులోనూ మంచి ఆఫర్స్ వచ్చాయి. ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘రాజా సాబ్’ సినిమాలో సంజయ్‌దత్ ఓ కీ రోల్ చేస్తున్నారని తెలిసింది. మారుతి దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఇక పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లోని ‘ఇస్మార్ట్‌శంకర్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’లో సంజయ్‌దత్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ సినిమాలో సంజయ్‌దత్ ఓ లీడ్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకుడు. మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తారు. రామ్‌చరణ్ నటించిన తొలి హిందీ చిత్రం ‘జంజీర్’లో సంజయ్‌దత్ ఓ లీడ్ రోల్ చేస్తారు. మరి…పదేళ్ల తర్వాత రామ్‌చరణ్, సంజయ్‌దత్ కలిసి నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. రామ్‌చరణ్ సినిమాకు కూడా సంజయ్‌దత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సంజయ్‌దత్ తెలుగులో చూసే మూడో సినిమా ఇదే అవుతుంది.