రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్’. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధిమారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, తమన్నా, సునీల్,శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీష్రాఫ్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ‘జైలర్’ సినిమా షూటింగ్‌కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ‘జైలర్’ సినిమాను వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు మూడోవారంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తు న్నారని కోలీవుడ్ సమాచారం.ఇక ‘జైలర్’ సినిమా కోసం రెండు దశాబ్దాల తర్వాత రమ్యకృష్ణ, మూడు దశాబ్దాల తర్వాత జాకీష్రాఫ్‌లతోకలిసి నటించారు రజనీకాంత్.
ఈ సినిమా తర్వాత రజనీకాంత్ ‘జైభీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్‌తో ఓ సినిమా చేస్తారు. అలాగే రజనీకూమార్తె ఐశ్వర్యరజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘లాల్‌సలామ్’లో రజనీకాంత్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దర్శకులు బాబీ, లోకేష్ కనగరాజన్ దర్శకత్వాల్లో రజనీకాంత్ హీరోగా సినిమాలు
తెరకెక్కుతాయనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.