హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లోని ‘పుష్ప’ ప్రాంచైజీలోని మలిపార్టు ‘పుష్ప: ది రూల్’ సినిమాలో జగపతిబాబు ఓ కీ రోల్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంగాజగపతిబాబు కన్ఫార్మ్ చేశారు. సుకుమార్, అల్లుఅర్జున్‌లతో కలిసి యాక్ట్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా కూడా జగపతిబాబు చెప్పుకొచ్చారు.
అయితే ‘పుష్ప: ది రూల్’ సినిమా ప్రధానంగామలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, అల్లు అర్జున్‌ల మధ్య జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితేఇటీవల విడుదలైన ‘పుష్ప: ది రూల్’ టీజర్లో విదేశాల ప్రస్తావన తీసుకొచ్చారు సుకుమార్. అలాగే ‘పుష్ప: ది రూల్’ లోగో చైనా, జపాన్ల ఫాంట్లను తలపిస్తోంది. అయితే ఈ చిత్రంలో చైనాలో ఉండేఓ విలన్ పాత్రలో జగపతిబాబు కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మైత్రీమూవీ మేకర్స్, ఈ చిత్రం దర్శకుడు సుకుమార్‌పై ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ‘పుష్ప: ది రూల్’ సినిమాషూటింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ‘పుష్ప’ ఫ్రాంచైజీలో థర్డ్పార్టు ‘పుష్ప: ది రూల్ బిగిన్స్’ లేదా ‘పుష్ప:ది గాడ్’ ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. రష్మికా మందన్నా హీరోయిన్గా న టిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఎన్టీఆర్ కెరీర్లో 25వ చిత్రంగా రూపొందిన ‘నాన్నకు ప్రేమతో..’ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. ఆ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే.